ఫుట్ పాయిజనింగ్ లక్షణాలు చికిత్స విధానం|Food Poisoning Causes, Symptoms and treatment in Telugu.

ఫుడ్ పాయిజన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎవరైతే కలుషిత ఆహారం తీసుకుంటారో అలాంటి వారికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఫుడ్ పాయిజనింగ్ కారణాలు :

  • కలుషిత ఆహారం తినడం
  • ఎక్స్పైరీ గడువు ముగిసిన ఆహారం తినడం
  • చేతులు శుభ్రంగా కడుక్కోకుండా తినడం
  • ఉడకని ఆహారం, ఉడకని కూరగాయలు తీసుకోవడం
  • చాలా రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తినడం
  • ఉడకని మాంసాహారం
  • కలుషితమైన నీళ్లు తాగడం వంటి కారణాలవల్ల ఫుడ్ పాయింజినింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఫుడ్ పాయిజనింగ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము :

  • చిన్నపిల్లల్లో
  • గర్భవతులు
  • వయసు పైబడిన వారు
  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఫుడ్ పాయిసెనింగ్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

ఫుట్ పాయిజనింగ్ లక్షణాలు :

  • కడుపునొప్పి
  • వాంతులు
  • విరోచనాలు
  • విరోచనాలలో రక్తం రావడం
  • కడుపులో తిమ్మిర్లు
  • జ్వరం
  • తలనొప్పి లక్షణాలు కనబడతాయి

ఫుడ్ పాయిసెనింగ్ నిర్ధారణ పరీక్షలు :

  • ఫుడ్ పాయిజనింగ్ ఉన్నవారికి లక్షణాల ప్రకారం ఒక నిర్ధారణకి వస్తారు. ఈ లక్షణాలతో పాటు కొన్ని రక్తపరీక్షలు వైద్యులు సూచిస్తారు.
  • స్టూల్ ల్ శాంపిల్ టెస్ట్ ( మల పరీక్ష )
  • బ్లడ్ టెస్ట్

ఫుడ్ పాయిజనింగ్ చికిత్స విధానం :

  • ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే వైద్యులు యాంటీబయటిక్స్ సూచిస్తారు.
  • పారా సైట్స్ వల్ల వచ్చినట్లయితే ఆంటీ పారాసైటిక్ మెడిసిన్స్ సూచిస్తారు.
  • అలాగే ప్రో బయోటిక్స్ తీసుకోమని వైద్యులు సలహా ఇస్తారు.

ఫుడ్ పాయిజన్ అయిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి :

  • అన్నం
  • రసం
  • కిచిడి
  • ఓట్స్
  • వైట్ బ్రెడ్
  • అరటిపండు పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవాలి
  • ఫుడ్ పాయిజన్ అయినవారు అన్నం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి.
  • అలాగే నీళ్లు కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ వంటివి ఎక్కువగా తాగాలి.

ఫుడ్ పాయిజన్ అయినవారు ఎటువంటి ఆహారం తినకూడదు :

  • బ్రౌన్ రైస్
  • పచ్చి కూరగాయలు పండ్లు
  • నూనె ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు
  • ఫ్రైడ్ ఫుడ్స్
  • కాఫీ, పాలు , చాయ్ వంటివి తక్కువగా తీసుకోవాలి
  • మసాలా ఉన్న ఆహార పదార్థాలు తగ్గించాలి
  • సోడా శీతల పానీయాలు కూడా తగ్గించాలి.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Leave a Comment