పాస్ టాబ్లెట్ లో tranexamic acid 500 mg ఉంటుంది. త్రానేక్సమిక్ ఆసిడ్ అనేది ఒక యాంటీ ఫైబ్రినోలైటిక్ మెడిసిన్, అధిక రక్త స్రావాన్ని తగ్గించే టాబ్లెట్.
పాస్ టాబ్లెట్ ఉపయోగాలు :
- నెలసరి లో వచ్చే అధిక రక్త స్రావం
- నెలల తరబడి వచ్చే పీరియడ్స్
- ముక్కులో నుంచి వచ్చే రక్త స్రావం
- సర్జరీ అయిన తరువాత ( ప్రొస్టేట్ గ్రంథి సర్జరీ, బ్లాడర్ సర్జరీ )
- కళ్ళ నుంచి వచ్చే రక్తం
- పన్ను తీసిన తర్వాత
- హీమోఫిలియ
పాస్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది :
పాస్ టాబ్లెట్ లో, లిక్విడ్, ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది.
పాస్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి :
పాస్ టాబ్లెట్ ఆ వ్యక్తి కి ఉన్న తీవ్రత ప్రకారం ఉపయోగించాలి. ఎవరికైతే అధిక రక్త స్రావం నెలల తరబడి వుంటుందో అలాంటి వారు ప్రతి రోజు మూడు పూటలు తిన్న తర్వాత టాబ్లెట్ తీసుకోవాలి.
పాస్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- గాబరవడం
- విరోచనాలు
- దురద పెట్టడం
- తల నొప్పి
- ఛాతీ నొప్పి లాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది.
పాస్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :
- ట్రానెక్సమిక్ ఆసిడ్ అలర్జీ
- కిడ్నీ ఇబ్బంది
- త్రాంబోసిస్
- DIC
- ప్రెగ్నెన్సీ
- పాలు ఇచ్చే తల్లులు
పాస్ టాబ్లెట్ ఎంత మోతాదులో ఉంటుంది :
పాస్ టాబ్లెట్ 250 మి.గ్రా ; 500 మి.గ్రా ; 1000 మి.గ్రా మోతాదులో అందుబాటులో ఉంటుంది.
Pause MF టాబ్లెట్ లో ట్రానెక్సామిక్ ఆసిడ్ అలాగే మెఫీనమిక్ ఆసిడ్ ఉంటుంది. ఎవరికైతే అధిక రక్త స్రావం అలాగే నొప్పి ఉంటుందో అలాంటి వారు Pause MF టాబ్లెట్ ఉపయోగించాలి.