పన్ను తీసిన తర్వాత డాక్టర్ గారు దూది పెడతారు. ఈ దూది సుమారు 30 నిమిషాలు కొరికి ఉంచాలి .
ఉమ్ము లేదా రక్తం వచ్చిన మింగేయాలి , బయటికి ఉమ్మీ వేయరాదు.
కొందరికి పన్ను తీసిన తర్వాత వాపు వస్తుంది. అలాంటి వారు వాపు తగ్గడానికి ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఎప్పుడైన ఐస్ నిరంతరంగా పెట్టుకోకూడదు , 15 నిమిషాలు పెట్టి 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఐస్ ప్యాక్ మొదటి రోజు మాత్రమే చేయాలి. ఐస్ క్రీం తినడం వలన కూడా కొంత విశ్రాంతి లభిస్తుంది.
పన్ను తీసిన మొదటి రెండు రోజులు మెత్తటి, చల్లని ఆహార పదార్థాలు,ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. వేడి పదార్థాలు, గరం మసాలా, శీతల పానీయాలు తీసుకోకూడదు.
పన్ను తీసిన వైపు కాకుండా వేరే వైపు నమలడం లాంటివి చేయాలి .
కొబ్బరి నీళ్లు , పండ్ల జూస్ తీసుకోవాలి. ఇవి తీసుకున్నపుడు స్ట్రా ఉపయోగించకూడదు.
పన్ను తీసిన వారం రోజుల వరకు ధూమపానం, ఆల్కహాల్ ,మద్యపానం చేయకూడదు. ఇలా చేయడం వలన పండు త్వరగా మానదు.
పన్ను తీసిన తర్వాత బ్రషింగ్ నెమ్మదిగా చేయాలి. పన్ను తీసిన చోట 3 రోజుల వరకు బ్రష్ చేయకూడదు.
పన్ను తీసిన 24 గంటల వరకు నోరు పుక్కింలించ కూడదు. ఒక రోజు తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పుక్కులించాలి .
పన్ను తీసిన తర్వాత టీ ,కాఫీ లాంటివి రెండు రోజులు పాటు తీసుకోకూడదు..
పన్ను తీసిన తర్వాత ఎక్కువగా మాట్లాడడం ,గట్టిగా నవ్వడం లాంటివి ఎక్కువగా చేయకూడదు అలాగే పన్ను తీసిన వైపు కాకుండా వేరే వైపు పడుకుంటే మంచిది .
పన్ను తీయడానికి లోకల్ అనస్థీషియా ఇస్తారు.. ఈ అనస్థీషియా ఇవ్వడం వలన స్పర్శ అనేది తెలీదు , ఈ సమయంలో నోరు,పెదాలు తెలియక కొరుక్క్కునే అవకాశం ఉంటుంది.కొద్దిగ జాగ్రత వహించాలి.
అలాగే టాబ్లెట్స్ , యాంట్టిబయోటిక్స్ కోర్స్ పూర్తి చేయడం వలన నొప్పి, వాపు రాకుండా తగ్గించవచ్చు.