న్యుమోనియా వ్యాధి ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలుz, లక్షణాలు, చికిత్స విధానం|Pneumonia Causes , Symptoms and Treatment in Telugu

న్యుమోనియా అనేది ఒక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్.ఊపిరి తిత్తులు బయటి వాతావరణం నుండి వచ్చే ప్రాణవాయువు (oxygen) ను రక్తంలోకి పంపించడం ,అలాగే రక్తం నుంచి చెడు వాయువు (carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడానికి ఊపిరి తిత్తులు సహాయ పడుతుంది

న్యుమోనియా వ్యాధి లక్షణాలు,చికిత్స విధానం

కొన్ని సందర్భాల్లో ఊపిరి తిత్తుల భాగమైన అలియోవోలి లో చీము చేరి న్యుమోనియా వచ్చే అవకాశం ఉంటుంది.

న్యుమోనియా వ్యాధి రావడానికి కారణాలు :

  • బ్యాక్టీరియా ( స్ట్రెప్టోకోకస్, మైకోప్లాస్మా, హీమోఫిలస్) ఇన్ఫెక్షన్
  • వైరస్ ( ఇన్ఫ్లోఎన్జా, కోవిడ్ )
  • ఫంగస్ ( న్యూమోసైటిస్, క్రిప్టోకొక్కస్ )

న్యుమోనియా ఎవరిలో ఎక్కువ వస్తుంది :

  • 0-2 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు
  • 65 ఏళ్లు పై బడిన వారు
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ( గర్భవతులు,హెచ్. ఐ. వి ఇన్ఫెక్షన్, స్టెరాయిడ్స్,క్యాన్సర్ )
  • ధూమపానం, మధ్య పానం చేసే వారికి న్యుమోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

న్యుమోనియా వ్యాధి లక్షణాలు :

  • దగ్గు
  • తెంబడ రావడం ( తెమడ పసుపు పచ్చగా మారడం)
  • జ్వరం
  • చాతి నొప్పి
  • తొందరగా అలసిపోవడం
  • ఆకలి వేయకపోవడం
  • వాంతులు లాంటి లక్షణాలు కనపడతాయి.

న్యుమోనియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు :

  • వైద్య నిపుణుల ప్రత్యేక పరిశీలన
  • ఛాతీ ఎక్స్ రే
  • రక్త పరీక్షలు
  • సిటీ స్కాన్
  • బ్రాంకోస్కోపి

న్యుమోనియా వ్యాధి చికిత్స విధానం :

* న్యుమోనియా వ్యాధి రావడానికి కారణం ప్రకారం చికిత్స ఉంటుంది.

* ఒకవేళ న్యుమోనియా బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే యాంటీ బయోటిక్స్, వైరస్ వలన అయితే యాంటీ వైరల్ డ్రగ్స్, ఫంగస్ ఇన్ఫెక్షన్ వలన వస్తే యాంటీ ఫంగల్ మెడిసిన్ వైద్యులు సూచిస్తారు.

న్యుమోనియా వ్యాధి వచ్చినప్పుడు పాటించవలసిన ఇంటి జాగ్రత్తలు :

  • ఎక్కువగా నీళ్లు త్రాగడం
  • గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి
  • ప్రతి రోజు రెండు నుండి మూడు సార్లు గోరు వెచ్చని నీటితో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పుక్కిలించడం ద్వారా కొంత వరకు న్యుమోనియా తగించవచ్చు

మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :

Pneumonia Causes and Treatment in Telugu

Leave a Comment