నోటి అల్సర్ , నోటి పొక్కులు చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిని “ఆఫ్తస్ అల్సర్స్” అని కూడా పిలుస్తారు.
నోటి అల్సర్స్, నోటి పొక్కులు కారణాలు :
1)ఎక్కువగా ఒత్తిడి తీసుకునే వారికి
2) పోషకాహారం లోపాల వలన ,విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపాల వలన
3) ఫుడ్ ఎలర్జీ, టూత్ పేస్ట్ వలన
4) దంత సమస్యల వలన (పళ్ళు విరిగిన లేదా పల్లకి క్లిప్స్ వేసుకున్నప్పుడు)
5) యాంటీబయాటిక్ లాంటి మెడిసిన్స్ వలన కూడా నోటిలో అల్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నోటి అల్సర్ కు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
నోటి అల్సర్ ఉన్నప్పుడు ఎక్కువగా వేడి అలాగే మసాలా పదార్థాలు తినకూడదు అలాగే ఎక్కువగా నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకోవాలి.
నోటి అల్సర్ త్వరగా తగ్గాలంటే ఎటువంటి మెడిసిన్ లేదా జెల్స్ తీసుకోవాలి :
నోటి అల్సర్ త్వరగా తగ్గాలంటే lignocaine అలాగే choline salicylate ఉన్న మందులు ( mucopain gel, zytee gel , dolo gel, kenacort gel, hexi gel ) ఇలాంటి మెడిసిన్స్ ఉపయోగించాలి.
నోటి అల్సర్ తగ్గించే జెల్ ఎలా ఉపయోగించాలి :
1) ఈ జెల్ ను ఉపయోగించే ముందు చేతులు శుభ్రంగా కడగాలి .
2) ఆ తరువాత కొద్దిగా జెల్ తీసుకుని ఎక్కడైతే అల్సర్ ఉందో అక్కడ కొద్దిగా పెట్టుకోవాలి .
3) ఈ జెల్ పెట్టుకున్న తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోకూడదు.
4) ఇలా ప్రతిరోజు మూడు నుంచి నాలుగు సార్లు పెట్టుకోవడం వలన నోటి అల్సర్ త్వరగా తగ్గడానికి అవకాశం ఉంది.
మరింత సమాచారానికి ఈ కింది వీడియో చూడండి.