డెంగ్యూ జ్వరం అనేది వైరల్ ఇన్ఫెక్షన్. Aedes Egypti అనే ఒక దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ కుట్టిన మూడు నుంచి 14 రోజుల తర్వాత డెంగ్యూ లక్షణాలు అనేవి కనబడతాయి.
డెంగ్యూ జ్వరం లక్షణాలు:
- తీవ్రమైన జ్వరం ఉండడం (104 F)
- తలనొప్పి
- కంటి వెనుక భాగంలో నొప్పి ఉండటం
- కండరాల నొప్పి
- శరీరంపై దద్దుర్లు
- వాంతులు
- విరోచనాలు
డెంగ్యూ జ్వరం నిర్ధారణ పరీక్షలు:
- NS1 రక్త పరీక్ష
- ELISA పరీక్ష
- RT PCR
NS1 లెవెల్స్ జ్వరం వచ్చిన ఐదు రోజుల లోపు ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ పరీక్ష ఎక్కువగా జ్వరం వచ్చిన ఐదు రోజుల్లో చేయించుకోమని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు.
ELISA పరీక్ష ద్వారా డెంగ్యూ యొక్క యన్ తెలుసుకోవచ్చు. జ్వరం వచ్చిన ఐదు రోజుల తర్వాత IgG యాంటీ బాడీస్ ఎక్కువగా ఉంటాయి. IgM యంటిబాడీస్ జ్వరం వచ్చిన పది రోజుల తర్వాత ఎక్కువగా ఉంటాయి.
RT PCR పరీక్ష ద్వారా కూడా అ డెంగ్యూ జ్వరాన్ని నిర్ధారించవచ్చు.
డెంగ్యూ జ్వరం చికిత్స విధానం:
డెంగ్యూ యొక్క లక్షణాలు ప్రకారం చికిత్స అనేది ఉంటుంది.
డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి?
- దోమకాటు ఉండకుండా చూడడం,
- చుట్టుపక్కల పరిశుభ్రత ఉంచడం.