టాన్సిలైటిస్ రావడానికి కారణాలు లక్షణాలు చికిత్స విధానం| Tonsillitis Causes, Symptoms and Treatment in Telugu.

టాన్సీల్స్ అనేవి లింఫ్ గ్రంధులు. ఇవి ప్రతి ఒక్కరిలో నోటి వెనుక భాగంలో ఉంటాయి. ఇది మన శరీరంలో రక్షణ కల్పించడానికి చాలా సహాయపడుతుంది.

కానీ కొన్ని సందర్భాల్లో ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఏర్పడి ఇబ్బందిని కలిగిస్తాయి. వీటిని మనం “టాన్సిలైటిస్” అని పిలుస్తాము.

టాన్సిలైటిస్ ఎక్కువగా 5 నుండి 15 ఏళ్ల లోపు చిన్నారులలో చూస్తాము.

టాన్సిలైటిస్( టాన్సిల్ ఇన్ఫెక్షన్) రావడానికి కారణాలు :

1) టాన్సిలైటిస్ వైరస్ “ఎప్స్టీన్ బార్ వైరస్” వలన లేదా బ్యాక్టీరియా “స్తెప్తో కోకస్ పయోజిన్స్” అనే బ్యాక్టీరియా వలన కూడా వస్తుంది ఎక్కువగా టాన్సిలైటిస్ వైరస్లను కలుగుతుంది.

2) కొన్ని సందర్భాల్లో శ్వాస కోసం వ్యవస్థ నుంచి కూడా టాన్సిల్ ఇన్ఫెక్షన్ రావచ్చు.

టాన్సిలైటిస్ ( టాన్సిల్ ఇన్ఫెక్షన్) లక్షణాలు :

  • గొంతు నొప్పి
  • గొంతులో ఇబ్బంది
  • తినడం, త్రాగడంలో ఇబ్బంది
  • జ్వరం
  • నోటి నుంచి దుర్వాసన రావడం లాంటి లక్షణాలు ఉంటాయి.

టాన్సిలైటిస్ ఉన్నవారు “ENT doctor” సంప్రదించాలి.

టాన్సిలైటిస్ నిర్ధారణ పరీక్షలు :

  • టాన్సిలైటిస్ ఉన్న వారు ENT డాక్టర్ దగ్గరికి వెళ్లి క్లినికల్ చెక్ అప్ చేయించుకోవాలి.
  • CRP రక్త పరీక్ష
  • రాపిడ్ స్ట్రెప్ టెస్ట్
  • త్రోట్ స్వాబ్ టెస్ట్

టాన్సిలైటిస్ చికిత్స విధానం :

  • సరైన రెస్ట్ తీసుకోవడం
  • టాన్సిలైటిస్ బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే యాంటీబయాటిక్స్ అమొక్సిసిలిన్ , అజిత్రో మైసిన్ వంటి టాబ్లెట్స్ తీసుకోవాలి.
  • జ్వరం నొప్పి ఉన్నట్లయితే నొప్పి మాత్రలు తీసుకోవాలి.
  • టాన్సిలైటిస్ తరచూ వచ్చినట్లయితే వైద్యులు సర్జరీ ద్వారా టాన్సిల్ నిర్మూలించమని సూచిస్తారు.

టాన్సిలైటిస్ త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు :

  • ఎక్కువగా నీళ్లు తాగాలి
  • గోరువెచ్చని నీళ్లు, సూప్స్, అల్లం చాయ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
  • గొంతు నొప్పి ఉన్నవారు గొంతు గర గర నీ తగ్గించే బిళ్ళలు తీసుకోవాలి.
  • గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ప్రతిరోజు మూడు నుంచి నాలుగు సార్లు పుక్కిలించాలి.
  • లేదా ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ ఉప్పు, ¼ టీ స్పూన్ పసుపు , అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని పుక్కిలించాలి.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

టాన్సిల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు,చికిత్స విధానం

Leave a Comment