జుట్టు ఊడకుండా ఉండాలంటే తీసుకోవలసిన 10 జాగ్రత్తలు !!!

Hair fall
  1. ప్రతి రోజు 2- 3 లీటరు నీళ్ళు త్రాగాలి
  2. ప్రతి రోజు తినే ఆహారం లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, బయోటిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, పాలకూర, గుడ్డు, పన్నీర్, పుట్ట గొడుగులు, టొమాటో, క్యాబేజ్, మొలకెత్తిన విత్తనాలు, ఫ్లాక్స్ గింజలు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి.
  3. ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే తలకి నూనె పెడుతూ ఉండాలి. డ్రై హెయిర్ ఉన్నవారు వారానికి మూడు సార్లు తలకి నూనె పెడుతూ ఉండాలి. ఆయిల్ జుట్టు ఉన్న వారు వారానికి ఒక్క సారి తలకి నూనె పెట్టాలి. నార్మల్ జుట్టు ఉన్నవారు వారానికి రెండుసార్లు తలకి నూనె పెట్టాలి.
  4. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్ళు చేయాలి. వేడి ,చల్లటి నీళ్లతో తల స్నానం చేయకూడదు. వేడి నీళ్ళతో తల స్నానం చేయడం వలన జుట్టు డ్రై అయ్యే అవకాశం ఉంటుంది.
  5. తల స్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వడం చేయకూడదు.
  6. హెయిర్ డ్రై , హెయిర్ స్ట్రెయిట్ చేయటం ఇలాంటివి ఎక్కువగా చేయకూడదు.
  7. జుట్టు కి కలర్ వేసినప్పుడు కేమికల్స్ తో కాకుండా హెన్నా పెట్టుకోవాలి. హెయిర్ ట్రీట్మెంట్ ( కేరాటిన్ ట్రీట్మెంట్, సిస్టీన్ హెయిర్ ట్రీట్మెంట్) చేయించకూడదు.
  8. స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవారు రోజ్ వుడ్ దువ్వెన ఉపయోగించాలి. కర్లీ హెయిర్ ఉన్నవారు వైడ్ టూత్ దువ్వెన ఉపయోగించాలి. ప్లాస్టిక్ దువ్వెన ఎప్పుడు ఉపయోగించకూడదు..
  9. జుట్టు నీ ఎపుడు టైట్ గా వేయకూడదు. లూజ్ పోనీ టైల్ వేసుకోవాలి.
  10. ఎక్కువగా హెల్మెట్ ఉపయోగించేవారు స్కార్ఫ్, లేదా తల పైన కర్చీఫ్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోవడం వలన జుట్టు ఊడకుండా కాపాడుకోవచ్చు.
జుట్టు ఊడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.

Leave a Comment