జీరా నీళ్లు (జీలకర్ర నీళ్లు ) ఉపయోగాలు| Benefits of Drinking Jeera water in Telugu.

ఆయుర్వేదం ప్రకారం జీరా నీళ్లు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

జీరా నీళ్ళు ఉపయోగాలు :

* జీరా నీళ్లు ప్రతిరోజు తాగడం వలన బరువు తగ్గుతారు.

* జీర్ణ వ్యవస్థ కి సంబంధించిన ఇబ్బంది ఉన్నవారు (అజీర్తి సమస్య, అసిడిటీ, కడుపు ఉబ్బరం) , రక్తహీనత సమస్య బాధపడేవారికి, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి, రక్త పోటును తగ్గించడానికి, జుట్టు దృఢత్వానికి, చర్మ సౌందర్యానికి ఈ జీర నీళ్లు చాలా సహాయపడుతూ ఉంటాయి.

* అలాగే జీరా నీళ్లు తాగడం వలన ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి , కడుపు తిమ్మిర్లు తగ్గించడానికి ఈ నీళ్ళు చాలా సహాయపడుతుంది.

జీరా నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి ?

జీరా నీళ్లు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి వీటిని బాగా మరిగించాలి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకొనీ ఐదు నిమిషాల పాటు మరగబెట్టాలి. కొంచెం చల్లారిన తరువాత వీటిని వడపోసి ఆ తరువాత కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు పడి గడపున తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యకరం.

జీరా నీళ్లు యొక్క దుష్ప్రభావాలు :

జీరా నీళ్లు ఒక గ్లాసు కన్నా ఎక్కువగా తీసుకున్నట్లయితే కడుపులో మంట, గుండె నొప్పి అలాగే షుగర్ లెవెల్స్ చాలా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారానికి ఈ క్రింది ఈ వీడియో చూడండి :

Leave a Comment