చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించే స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా ఉపయోగించాలి|How to Use Stolin, Sensoform Gum Paint in Telugu.

చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఉన్నవారికి డాక్టర్స్ ఈ గం పెయింట్ ఉపయోగించమని సూచిస్తారు.

స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఉపయోగాలు :

  • చిగుళ్ల ఇన్ఫెక్షన్
  • చిగుళ్ల వాపు
  • చిగుళ్ళ నుంచి రక్తం రావడం
  • చిగుళ్ళ నొప్పి
  • చిగుళ్ళు కిందికి జారినప్పుడు
  • నోటి ఇన్ఫెక్షన్

స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా పని చేస్తుంది :

* టానిక్ ఆసిడ్ , గ్లిసరిన్ – ఆస్ట్రిన్జెంట్ అంటే రక్తం రావడం తగ్గిస్తుంది అలాగే చిగుళ్ళ నుండి వచ్చే చీము నీ తగ్గిస్తుంది.

* పొటాషియం అయోడైడ్ – యాంటీ సెప్టిక్ ,బ్యాక్టీరియా, వైరస్ లను చంపుతుంది.

* మెంతాల్ – కూలింగ్ ఏజెంట్ , అలాగే నొప్పిని కూడా తగ్గిస్తుంది.

* థైమాల్ – చిగుళ్ళ ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది.

అలాగే కొన్ని గం పెయింట్ లలో జింక్ సల్ఫేట్ ఉంటుంది , ఈ జింక్ సల్ఫేట్ కూడా చిగుళ్ళ నుండి రక్తం రావడం తగ్గిస్తుంది.

స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా ఉపయోగించాలి :

  • ఎప్పుడైనా గం పెయింట్ పళ్ళు తోమిన తర్వాత పెట్టుకోవాలి.
  • ఒకటి నుండి రెండు చుక్కలు మాత్రమే తీసుకోవాలి.
  • చూపుడు వేలు సాహాయంతో లేదా దూది వత్తులతో చిగుళ్ల ముందు భాగం అలాగే వెనక భాగం లో పెట్టు కోవాలి.
  • ఇలా పెట్టిన తర్వాత నెమ్మదిగా అద్ధి నట్టు పెట్కోవాలి లేదా నెమ్మదిగా మసాజ్ చేయాలి.
  • ఎప్పుడైనా స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ అద్ది నట్టు పెట్టాలి, గట్టిగా చిగుళ్ళ పైన రుద్ధ కూడదు. ఇలా చేయడం వలన చిగుళ్ల పైన గుల్లలు వచ్చే అవకాశం ఉంటుంది.
  • స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ పెట్టిన తర్వాత నీళ్లు తాగడం,అన్నం తినటం, పుక్కిలంచడం లాంటివి ఒక అర గంట వరకు చేయకూడదు.

మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :

చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించే మందు ఎలా ఉపయోగించాలి

Leave a Comment