గ్రీన్ టీ తాగడం వలన కలిగే ఉపయోగాలు,దుష్ప్రభావాలు |Health Benefits of drinking Green Tea.

గ్రీన్ టీ “కెమేలియా సినేసిస్ ” అనే ఆకుల నుంచి తయారవుతుంది. గ్రీన్ టీ లో 90% ఫీనాల్స్ ( కాటేకిన్, ఎపి కాటెకిన్, గాలో కాటేకిన్ ) 7 % ఎమినో యాసిడ్స్, 3 % తీయనిన్ , ప్రో అంత సాయనిడ్ ,కేఫిన్ ఉంటుంది.

గ్రీన్ టీ ఉపయోగాలు :

  • చర్మ సౌందర్యానికి, చర్మం కాంతి వంతంగా ఉండడానికి, చర్మ పరిరక్షణకు గ్రీన్ టీ ఉపయోగ పడుతుంది.
  • జుట్టు దృఢత్వాన్ని పెంచుతుంది, జుట్టు రాలడం తగ్గిస్తుంది.
  • బరువు తగ్గిస్తుంది , కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
  • ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, క్యాన్సర్ ( బ్రెస్ట్ క్యాన్సర్,ప్రొస్టేట్ క్యాన్సర్, కోలో రెక్టల్ క్యాన్సర్ ) రాకుండా నివారిస్తుంది.
  • ప్రతి రోజు గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మెదడు సరిగా పని చేయడానికి ఇవి సహాయ పడుతుంది.
  • సుగర్ వ్యాధి రాకుండా కూడా నివారిస్తుంది.

గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకోవాలి ?

గ్రీన్ టీ

గ్రీన్ టీ పొద్దున,లేదా మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటలు తిన్న తరువాత తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చకూరుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

ప్రతి రోజు రెండు నుండి మూడు గ్లాసులు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

గ్రీన్ టీ దుష్ప్రభావాలు :

  • గ్రీన్ టీ అధిక మోతాదులో తీసుకోవడం వలన లివర్ ( కాలేయ సంబంధిత) ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది.
  • కాలు, చేతులు వణకడం
  • పళ్ల పైన మరకలు రావడం లాంటి దుష్ప్రభావాలు వస్తాయి.

గ్రీన్ టీ ఎవరు తీసుకోకూడదు :

  • విరోచనాలు
  • అధిక రక్త పోటు
  • కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు
  • కడుపులో అల్సర్స్ సమస్య ఉన్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోకూడదు.

Frequently Asked Questions

గ్రీన్ టీ గర్భవతులు ,పాలు ఇచ్చే తల్లులు తీసుకోవచ్చా ?

గ్రీన్ టీ గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు తీసుకోవచ్చు. ప్రతి రోజు రెండు కప్పులు వరకు తీసుకోవచ్చు.

గ్రీన్ టీ ఎంత వయసు వాళ్ళు తీసుకోవాలి ?

గ్రీన్ టీ 12 ఏళ్లు దాటిన వారు తీసుకోవాలి.

థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తీసుకోవచ్చా ?

థైరాయిడ్ సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తీసుకోవచ్చు కానీ అధిక మోతాదులో లో తీసుకోకూడదు, మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

గ్రీన్ టీ తాగడం వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు.

Leave a Comment