గొంతు నొప్పి ఉన్నవారికి గొంతులో ఇబ్బంది అలాగే ఏదైనా తిన్నప్పుడు గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది.
గొంతు నొప్పి రావడానికి కారణాలు :
- బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
- వైరల్ ఇన్ఫెక్షన్
- అలర్జీ
- పొగ త్రాగడం
- వాహనాలు లేదా ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వలన కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గొంతు నొప్పి లో గొంతు నొప్పి తో పాటు జ్వరం, ఒళ్ళు నొప్పులు , అలాగే టాన్సిల్ ఇబ్బంది ఉంటుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గొంతు నొప్పి లో గొంతు నొప్పి తో పాటు జలుబు ,దగ్గు ఉంటుంది.
గొంతు నొప్పి తగ్గాలంటే ఇంటి చిట్కాలు :
- ప్రతి రోజు నాలుగు పూటలు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని పుక్కిలించాలి.
- గొంతు నొప్పి ఉన్నపుడు ఎక్కువగా నీళ్లు త్రాగాలి, వేడి సూప్స్, కడ ఛాయి, శొంఠి మిరియాలు టీ, పసుపు పాలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి
- ఒక టీ స్పూను తేనె తీసుకోవడం
- అలాగే గొంతు నొప్పి ఉన్నపుడు ఎక్కువగా స్పైసీ, మసాలా ఆహారాలు తీసుకోకూడదు.
గొంతు నొప్పి మందులు :
- స్త్రెప్సిల్స్
- ఆంటీ సెప్టిక్ మౌత్ వాష్ ( రెక్సిడిన్, పోవుడిన్ అయోడిన్ ) లాంటి నోట్లో పుక్కులించే మందు
- ఆంటీ ఇన్ఫ్లా మేటరీ మౌత్ వాష్ ( కూలోర మౌత్ వాష్) లాంటి నోట్లో పుక్కులించే మందు తీసుకోవడం వలన కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.
- బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన వచ్చే గొంతు నొప్పికి అమాక్సిల్లోన్, అజిత్రో మైసిన్ లాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి.
- వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గొంతు నొప్పికి ఐబుప్రోఫెన్ లాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి.
గొంతు నొప్పి అనేది సాధారణంగా ఒక మూడు నుంచి వారం రోజులు లో తగ్గుతుంది. ఆ తరువాత కూడా గొంతు నొప్పి తగ్గనట్లయితే వైద్యుడు నీ సంప్రదించాలి.
గొంతు నొప్పి రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు :
- శుభ్రత పాటించాలి – ఏవైనా తినే ముందు చేతులు శుబ్రంగా కడగాలి అలాగే శానిటైసర్ ఉపయోగించాలి.
- వేరే వాళ్ళ ఆహారం, శీతల పానీయాలు తీసుకోకూడదు.
- తుమ్మినా ,దగ్గిన చేతులు లేదా హ్యాండ్ కర్చీఫ్ అడ్డంగా పెట్టుకోవాలి.