గుడ్డు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆహార పదార్థాలు.
గుడ్డు లో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్ లో విటమిన్ ( A,D,E,K) , ఫోలేట్, ఫాస్ఫరస్, సెలీనియం,జింక్ ఎక్కువగా ఉంటాయి.
గుడ్డు లో లేసితిన్, జీయక్సాంతిన్ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపు మెరుగు పరచడానికి, కేటరాక్ట్ రాకుండా నివారించడానికి గుడ్డు చాలా సహాయ పడుతుంది.
వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మంచి కొలెస్ట్రాల్ నీ పెంచడానికి, గుండె జబ్బు,స్ట్రోక్ రాకుండా నివారించడానికి ఇవి చాలా సహాయ పడుతుంది.
ప్రతి రోజు గుడ్డు తినడం వలన శక్తి పెరుగుతుంది,అలసట తగ్గుతుంది.అలాగే మెదడు సరిగా పని చేయడానికి ఇవి చాలా సహాయ పడుతుంది.
గుడ్డు జుట్టు కాంతి వంతంగా, ఆరోగ్య వంతంగా ఉండడానికి సహాయ పడుతుంది. నార్మల్ జుట్టు ఉన్నవారు గుడ్డు తెల్ల సొన ,పచ్చ సొన పెట్టుకోవాలి. ఆయిల్ జుట్టు ఉన్నవారు గుడ్డు తెల్ల సొన పెట్టుకోవాలి.
చర్మ సౌందర్యానికి, కూడా గుడ్డు తినడం చాలా మంచిది.
గుడ్డు తెల్ల సొన లో విటమిన్ (A,D,E,K) ఫోలేట్, లేసితిన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డు పచ్చ సొన లో సెలీనియం,కాల్షియం, మెగ్నీషియం,ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది.
గుడ్డు పచ్చ సొన లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.అందువలన ఎవరికైతే గుండె సంబంధిత ఇబ్బంది ఉంటుందో అలాంటి వారు గుడ్డు తెల్ల సొన తీసుకోవాలని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.
ప్రతి రోజూ ఎన్ని గుడ్లు తినాలి ?
మనం తీసుకునే ప్రోటీన్స్ ప్రకారం గుడ్లు తీసుకోవాలి. నార్మల్ ఆరోగ్యంగా ఉన్నవారు, గుండె ఇబ్బంది లేని వారు ప్రతి రోజు 1-2 గుడ్లు తీసుకోవచ్చు.
కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు, గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నవారు వారానికి 4-5 గుడ్లు తీసుకోవచ్చు.