ఖర్జూర పండు లో పోషక విలువలు ఉండడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఖర్జూర పండ్లు పోషక విలువలు :
ఖర్జూర పండు లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువలన జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ,అజీర్తి ఉన్నవారికి , మలబద్దకం తో బాధపడేవారికి ఖర్జూర పండ్లు చాలా ఉపయోగపడతాయి .
ఖర్జూర పండు లో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువలన డయాబెటీస్ ( షుగర్ ) వ్యాధి గ్రస్తులు కూడా ఈ పండు తీసుకోవచ్చు.
ఈ ఖర్జూర పండు లో ఆంటీ ఆక్సిడెంట్స్,కారోటీనీడ్, ఫ్లావ నోయిడ్ , ఎక్కువగా ఉంటుంది. దీని వలన గుండె ఆరోగ్యానికి ,చర్మ సౌందర్యానికి , జుట్టు దృఢత్వాన్ని కి ఖర్జూర పండు చాలా సహాయపడతాయి.
ఖర్జూర పండు తినడం వలన రక్తం లో హీమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్త హీనత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఖర్జూర పండు తినడం వలన హీమోగ్లోబిన్ పెరుగుతుంది.
ఖర్జూర పండు లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి ఈ పండ్లు చాలా సహాయ పడతాయి .
ఖర్జూర పండు ప్రెగ్నెన్సీ మహిళలు కూడా తీసుకోవచ్చు.
ప్రతి రోజు ఎన్ని ఖర్జూర పండ్లు తీసుకొవాలి ?
ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు 2 – 4 ఖర్జూర పండ్లు ఉదయం పూట ( పడిగడపున ) తీసుకోవాలి .
ఖర్జూర పండ్లు ఎవరు తీసుకోకూడదు ?
- అలర్జీ ఉన్నవారు
- ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్
- విరోచనాలు
- ఆస్థమా సమస్యలతో బాధపడేవారు ఈ ఖర్జూర పండ్లు తక్కువ తీసుకుంటే మంచిది.