కొబ్బరినీళ్లు ఆరోగ్య ప్రయోజనాలు| Benefits of drinking Coconut Water in Telugu.

Benefits of Coconut Water

* కొబ్బరినీళ్లు వేసవి కాలంలో లభించే ఒక అమృతం. కొబ్బరి నీళ్ళలో ఆసిడ్ ఫాస్ఫాటాస్ , కేటాలస్ ఉండడం వలన జీర్ణం త్వరగా అవుతూ ఉంటుంది, అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

* కొబ్బరినీళ్లు తాగడం వలన మూత్రంలో మంట, మూత్రానికి వెళ్ళినప్పుడు ఇబ్బందినీ తగ్గిస్తుంది.

* అలాగే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారికి , ఈ నీళ్లు చాలా ఉపయోగ పడుతూ ఉంటుంది.

* కొబ్బరి నీళ్లలో cytokinins ఉండడం వలన చర్మ సౌందర్యానికి , చర్మం మృదువుగా ఉండడానికి చాలా సహాయపడుతుంది .

* అలాగే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వలన క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.

* కొబ్బరి నీళ్ళు లో విటమిన్ బి 1 , బీ5 , బి7 అధిక మోతాదులో ఉంటుంది.

కొబ్బరి నీళ్లు – ఎలక్ట్రో లైట్స్

* కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రో లైట్స్ అధికంగా ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికి అలాగే కండరాలు ఆరోగ్యానికి ఇది చాలా సహాయపడుతుంది.

* సోడియం ఎక్కువగా ఉండటం వలన ఎవరైతే వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగుతారో ఎక్కువ బలం ఇవ్వడానికి ఈ నీళ్ళు చాలా ఉపయోగపడతాయి.

* కొబ్బరి నీళ్లలో క్యాల్షియం , ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ కొబ్బరి నీళ్లు తాగడం వలన ఎముకల దృఢత్వం అలాగే నరాలకి చాలా సహాయపడుతూ ఉంటుంది.

* కొబ్బరినీళ్లు షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా మితంగా తీసుకోవచ్చు.

మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :

Leave a Comment