కిడ్నీలో రాళ్లు(కిడ్నీ స్టోన్స్) లక్షణాలు,చికిత్స విధానం, నివారణ చర్యలు| kidney stones causes symptoms and treatment in Telugu

కిడ్నీలో రాళ్లను మెడికల్ టర్మినాలజీ లో “రీనల్ క్యాల్కు లై” ,”నెఫ్రో లిథియాసిస్” , “యూరో లిథియాసిస్” అని కూడా అంటారు.

కిడ్నీ రాళ్లు అనేవి మినరల్స్ అలాగే సాల్ట్స్ తో చిన్న చిన్న గడ్డలుగా కిడ్నీలో ఏర్పడతాయి.

కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏం చేయాలి ?

కిడ్నీ స్టోన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి :

* ఈ రాళ్లు అనేవి కిడ్నీలో ఏర్పడితే వీటిని “కిడ్నీ స్టోన్స్” అని పిలుస్తారు.

* ఇవే రాళ్లు కిడ్నీ యొక్క భాగమైన యురేటర్లో ఏర్పడితే వీటిని “యురేటరల్ స్టోన్స్” అంటారు.

* ఒకవేళ ఈ రాళ్లు అనేవి మూత్రాశయంలో ఏర్పడితే వీటిని “బ్లాడర్ స్టోన్స్” అని పిలుస్తారు.

* ఎక్కువగా కిడ్నీలో రాళ్లు అనేవి కాల్షియం అనే మినరల్ తో ఏర్పడతాయి. అటువంటి రాళ్ళను క్యాల్షియం స్టోన్స్ అని పిలుస్తారు .ఈ క్యాల్షియం స్టోన్స్ ఎక్కువగా క్యాల్షియం ఆక్సిలేట్, క్యాల్షియం ఫాస్పటిస్ అనే మినరల్స్ తో ఏర్పడతాయి. కిడ్నీలో ఎక్కువగా ఈ క్యాల్షియం స్టోన్స్ వస్తాయి.

* యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ” స్త్రూవైట్ స్టోన్స్” ఏర్పడతాయి.

* విరోచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యతో బాధపడే వారిలో “యూరిక్ ఆసిడ్ స్టోన్స్” అనేవి ఏర్పడతాయి.

కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణాలు :

  • డిహైడ్రేషన్ సమస్య (వాంతులు ,విరోచనాలు, నీళ్లు తక్కువగా తీసుకోవడం)
  • ఉప్పు ,ఆక్సిలేట్, పాలకూర, చాక్లెట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం
  • యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్
  • హైపర్ ప్యారా థైరాయిడ్ సమస్య
  • ఇరిటేబుల్ బోవేల్ సిండ్రోమ్
  • వంశపారం పర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

కిడ్నీలో రాళ్లు లక్షణాలు :

కిడ్నీలో రాళ్లు వెడల్పు చిన్నగా ఉండి అటు ఇటు కదిలితే ఎటువంటి లక్షణాలు కనబడవు. కానీ కొందరిలో కిడ్నీలో రాళ్లు వెడల్పు ఎక్కువగా ఉండి కిడ్నీ యొక్క దారిని బ్లాక్ చేస్తూ ఉంటుంది అటువంటి వారిలో లక్షణాలు కనబడతాయి.

  • మూత్రానికి వెళ్ళినప్పుడు నొప్పి
  • మూత్రంలో మంట
  • మూత్రంలో రక్తం రావడం
  • మూత్రం బుడగలు రావడం
  • మూత్రం ఆగుకుంటు కొద్ది కొద్దిగా రావడం
  • కిడ్నీలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశంలో తీవ్రమైన నొప్పి రావడం, కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి అనేది కడుపుకి రేడియట్ అవుతూ ఉంటుంది.
  • గాబరావడం
  • వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయి.

కిడ్నీ స్టోన్స్ నిర్ధారణ పరీక్షలు :

  • ఎక్స్రే రే
  • అల్ట్రా సౌండ్ స్కాన్
  • సిటీ స్కాన్
  • మూత్ర పరీక్ష
  • రక్త పరీక్ష

కిడ్నీ స్టోన్స్ చికిత్స విధానం :

* కిడ్నీలో రాళ్లు వెడల్పు ప్రకారం చికిత్స విధానం ఉంటుంది . ఒకవేళ కిడ్నీలో రాళ్లు అనేవి ఐదు మిల్లీమీటర్స్ కన్న తక్కువ ఉన్నట్లయితే 90 శాతం ఈ రాళ్లు అనేవి మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది.

* కిడ్నీలో రాళ్లు ఐదు మిల్లీ మీటర్స్ నుంచి పది మిల్లీమీటర్ ఉన్నట్లయితే 50% ఈ రాళ్లు మూత్రం ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.

* కిడ్నీలో రాళ్లు అనేవి 10 మిల్లీమీటర్ల కన్నా వెడల్పు ఉన్నట్లయితే మెడిసిన్స్ లేదా సర్జరీ చేయవలసి వస్తుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఎటువంటి టాబ్లెట్ తీసుకోవాలి ?

* కిడ్నీ రాళ్లు ఉన్నప్పుడు నొప్పి ఉన్నట్లయితే నొప్పి తగ్గించే టాబ్లెట్ తీసుకోవాలి.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఎటువంటి శస్త్ర చికిత్స చేస్తారు ?

* కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగించడానికి వైద్యులు ఎక్కువగా “ఆల్ఫా బ్లాకర్స్”( Tamsulosin ) వంటి టాబ్లెట్స్ ఉపయోగిస్తారు. ఈ ఆల్ఫా టాబ్లెట్స్ కండరాలను రిలాక్స్ చేస్తాయి.దీనివల్ల రాళ్లు అనేవి బయటకి వచ్చే అవకాశం.

  • షాక్ వేవ్ లితో ట్రిప్సి (SWL )
  • యురేటరు స్కోపి
  • పర్ క్యుటనియస్ నేఫ్రో లితియసిస్ ( PCNL )

మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :

Kidney stones ( కిడ్నీ లో రాళ్లు )

Leave a Comment