కాల్షియం తక్కువగా ఉంటే కనబడే లక్షణాలు| కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు.

కాల్షియం అనేది మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన కణజాలం. ఈ కాల్షియం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

కాల్షియం తక్కువ లక్షణాలు

కాల్షియం ఉపయోగాలు :

  • ఎదుగుదలకు
  • ఎముకల దృఢత్వానికి
  • కండరాలు పనితీరుకు
  • గుండె కొట్టుకోవడానికి
  • నరాలు పనిచేయుటకు క్యాల్షియం చాలా ఉపయోగపడుతుంది

కాల్షియం తక్కువ ఉండడానికి గల కారణాలు :

  • కాల్షియం తక్కువ అనేది చిన్నపిల్లలు తరచూ చూస్తూ ఉంటాము
  • తినే ఆహారంలో సరిపడా కాల్షియం లేకపోవడం
  • పారా థైరాయిడిజం, కిడ్నీ సంబంధిత ఇబ్బంది ఉన్నవారిలో క్యాల్షియం తక్కువగా ఉంటుంది.
  • డైయూరాటిక్స్ వంటి మందులు ఉపయోగించే వారిలో
  • ఆడవారిలో వచ్చే హార్మోనల్ హెచ్చుతెగుల వలన కూడా కాల్షియం తక్కువ అవుతుంది.
  • మెనోపాజ్ అయిన ఆడవారిలో, శాఖాహారుల్లో, లాక్టోస్ ఐన్ టోలరెన్స్ వంటి ఇబ్బందులు ఉన్నవారిలో క్యాల్షియం లెవెల్స్ అనేవి తగ్గుతాయి.

కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు కనబడే లక్షణాలు :

  • తిమ్మిర్లు రావడం
  • కాళ్లు చేతులు వనకడం
  • కాళ్లు చేతులు వంకర పడిపోవడం
  • కండరాల నొప్పి
  • ఎముకల దృఢత్వం తగ్గిపోవడం
  • నడవడంలో ఇబ్బంది
  • తొందరగా అలసిపోవడం
  • నిద్ర రాకపోవడం
  • కళ్ళు తిరగడం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • చర్మం పొడిబారడం
  • జుట్టు ఎండిపోయినట్టు డ్రై గా ఉండడం
  • గోర్లు త్వరగా విరిగిపోవడం
  • పంటి నొప్పి , చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కాల్షియం లోపించడం వలన వస్తాయి.

కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఎటువంటి చికిత్స చేస్తారు :

కాల్షియం తక్కువగా ఉన్నవారికి డాక్టర్స్ క్యాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఉపయోగించమని సూచిస్తారు.

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు :

  • పాలు
  • పన్నీర్
  • సోయాబీన్స్
  • బాదం
  • అంజీర
  • బెండకాయ
  • శనగలు
  • నువ్వులు
  • చియా సీడ్స్
  • సన్ ఫ్లవర్ సీడ్స్
  • ట్యూన ఫిష్
  • సాల్మన్ ఫిష్
  • రొయ్యలు వంటి ఆహార పదార్థాల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి

Calcium Defeciency Symptoms in Telugu

Leave a Comment