కాల్షియం టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి, ఎన్ని రోజులు ఉపయోగించాలి

కాల్షియం అనేది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన కణజాలము. కాల్షియం ఎముకల దృఢత్వానికి , నరాలకి గుండె ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ప్రతిరోజు 1000 – 1200 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం తీసుకోవాలి.

Calcium tablets
Calcium tablets

క్యాల్షియం అనేది చిన్నపిల్లలలో, మెనూపాస్ అయిన ఆడవారిలో, శాఖాహారులు, లాక్టోస్ ఇంటలిరన్స్ వంటి సమస్యలు బాధపడే వారిలో ఎక్కువగా కాల్షియం అనేది తగ్గుతాయి.

కాల్షియం తక్కువగా ఉన్న వారికి డాక్టర్స్ క్యాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు లేదా కాల్షియం టాబ్లెట్స్ ఉపయోగించమని సూచిస్తారు. కాల్షియం అనేది టాబ్లెట్స్, క్యాప్సూల్స్ , సిరప్స్, అలాగే పౌడర్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

కాల్షియం అనేది ఎక్కువగా కాల్షియం కార్బోనేట్, క్యాల్షియం సిట్రేట్, క్యాల్షియం ప్లస్ విటమిన్ డి3, క్యాల్షియం మెగ్నీషియం విటమిన్ డి3 వంటి కాంబినేషన్స్ లో అందుబాటులో ఉంటాయి.

కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్స్ :

క్యాల్షియం టాబ్లెట్స్ లో ఎక్కువగా కాల్షియం కార్బెట్ ఉంటుంది .ఇది చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి.

కాల్షియం కార్బోనేట్ శరీరంలో కణాలకి చేరాలంటే ఆసిడ్స్ అనేవి చాలా అవసరం . అందువలన ఈ క్యాల్షియం కార్బోనేట్ టాబ్లెట్స్ అనేవి తిన్న తర్వాత తీసుకోమని వైద్యులు సూచిస్తారు.

కాల్షియం కార్బోనేట్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. కడుపులో గ్యాస్ రావడం, తేన్పులు, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలు చూస్తాము.

కాల్షియం సిట్రేట్ టాబ్లెట్స్ :

కాలుష్యం సిట్రేట్ అనేది చాలా ఖరీదైనది. ఈ కాల్షియం సిట్రేట్ శరీరంలోకి వెళ్లడానికి ఆసిడ్స్ అవసరం ఉండదు. అందువలన ఈ టాబ్లెట్స్ అనేవి తినక ముందు కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ఆంటాసిడ్స్, ఇరిటేబుల్ బోవేల్ సిండ్రోమ్ వంటి సమస్యతో బాధపడుతున్నారు అలాంటివారికి ఈ టాబ్లెట్స్ వైద్యులు ఎక్కువగా సూచిస్తారు.

కాల్షియం & విటమిన్ డి 3 టాబ్లెట్స్ :

విటమిన్ d3 అనేది కాల్షియం శరీరంలోకి త్వరగా వెళ్లడానికి సహాయపడుతుంది. ఈ కాల్షియం విటమిన్ డి3 కాంబినేషన్ టాబ్లెట్స్ అనేవి చాలా తక్కువ ఖర్చుతో మెరుగైన పనితీరు చూపెడుతుంది అందువల్ల ఎక్కువగా డాక్టర్స్ ఈ టాబ్లెట్ సూచిస్తారు.

కాల్షియం & కాల్సిట్రయాల్ టాబ్లెట్స్ :

కాల్సిట్రాయాల్ అనేది విటమిన్ డి3 ఆక్టివ్ ఫార్మ్. ఈ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవడం , కిడ్నీలో రాళ్లు ఏర్పడడం ఉంటాయి . అలాగే ఇది చాలా ఖరీదైనది కొన్ని సందర్భాల్లో మాత్రమే డాక్టర్స్ ఈ టాబ్లెట్ సూచిస్తారు.

కాల్షియం టాబ్లెట్స్ ఎన్ని రోజులు ఉపయోగించాలి :

కాల్షియం టాబ్లెట్స్ అనేవి తీవ్రత ప్రకారం ఉపయోగించాలి . సుమారు ఒకటి నుండి మూడు నెలల వరకు కాల్షియం టాబ్లెట్స్ ఉపయోగించాలి.

కాల్షియం టాబ్లెట్స్ ఎవరు ఉపయోగించకూడదు :

Antacids (Omeprazole, Rabeprazole, Pantaprazole) , యాంటీబయాటిక్స్ ( టెట్రా సైక్లిన్, సిప్రాఫ్లోకేసిన్) , రక్త హీనతకి ఉపయోగించే ఐరన్ టాబ్లెట్స్, లేవో థైరాక్సిన్ థైరాయిడ్ టాబ్లెట్స్ ఉపయోగించేవారు ఒకసారి వైద్యుని సంప్రదించి ఏ సమయంలో ఉపయోగించే వీటి పనితీరు ఎక్కువగా ఉంటుంది అని కనుక్కొని ఈ టాబ్లెట్స్ ఉపయోగించాలి. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన క్యాల్షియం అనేది తగ్గుతుంది.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Leave a Comment