ఐరన్ మన శరీరానికి అవసరమైన చాలా ముఖ్యమైన కణజాలం. ఐరన్ మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ ని తయారు చేయడానికి చాలా సహాయపడుతుంది.
ఐరన్ తక్కువగా ఉంటే కనబడే లక్షణాలు :
- తొందరగా అలసిపోవడం
- నీరసంగా ఉండడం
- చర్మం పేలిపోవడం
- చాతి నొప్పి
- గుండె వేగంగా కొట్టుకోవడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం
- తలనొప్పి
- గాబరావడం
- కాళ్లు చేతులు చల్లగా అయిపోవడం
- గోర్లు అనేవి స్పూన్ ఆకారంలో మారడం ,అలాగే గోళ్ళ పైన పొడవాటి లైన్స్ రావడం గోలు తొందరగా పగిలిపోవడం
- ఆకలి వేయకపోవడం
- జుట్టు ఊడిపోవడం
- నోరు చుట్టూ పగుళ్లు రావడం
- నోటిలో అల్సర్
- నాలుక చెప్పబడిపోవడం వంటి లక్షణాలు ఐరన్ తక్కువగా ఉంటే కనబడతాయ.
- ఐరన్ తక్కువ అవ్వడానికి కారణాలు :
- శరీరం నుంచి రక్తం పోవడం : ఆడవారిలో వచ్చే నెలసరి, కడుపులో అల్సర్, హయాటల్ హరినియా, కోలన్ పాలిప్ వంటి కారణాలవల్ల ఐరన్ అనేది తగ్గుతూ ఉంటుంది.
- తీసుకున్న ఆహారంలో సరిపడా ఐరన్ లేకపోవడం
- శరీరంలో ఐరన్ ఉన్నా కానీ ఐరన్ అబ్సర్బ్ చేయకపోవడం వల్ల కూడా ఐరన్ తగ్గుతుంది
నిర్ధారణ పరీక్షలు :
- సి. బి. పి.
- హిమోగ్లోబిన్
- రక్తంలో ఐరన్ లెవెల్స్
- ఫేరిటిన్ పరీక్ష
ఐరన్ ఎవరిలో ఎక్కువగా తగ్గుతుంది :
- ఆడవారు
- చిన్నపిల్లలు
- శాకాహారులు
- ఎక్కువగా రక్తం ఇచ్చే వారిలో ఐరన్ తగ్గుతుంది.
ఐరన్ తక్కువగా ఉంటే ఎటువంటి చికిత్స చేస్తారు :
- ఐరన్ మందులు సుమారు మూడు నుంచి 6 నెలలు ఉపయోగించమని వైద్యులు సూచిస్తారు.
- రక్త మార్పిడి ద్వారా కూడా ఐరన్ నిల్వలు పెంచవచ్చు.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :