ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి, వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి ?

ఎక్కిళ్ళు అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు అనేవి డయాఫ్రం అని కండరం సంకోచించడం అలాగే స్వర పేటిక హఠాత్తుగా మూసుకుపోవడం వలన శ్వాస అనేది ఊపిరి తిత్తులలో చేరి ఎక్కిళ్ళు వస్తాయి.

డయాఫ్రమ్ అనేది ఊపిరితిత్తులను అలాగే కడుపు ఉబర భాగాన్ని విభజిస్తూ ఉంటుంది .

ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏం చేయాలి

ఎక్కిళ్ళు రావడానికి గల కారణాలు :

  • అధికంగా తినడం
  • త్వరగా తినడం
  • తొందర తొందరగా నీళ్లు తాగడం
  • ఎక్కువగా శీతల పానీయాలు తాగడం
  • గ్యాస్త్రైటిస్
  • ధూమపానం , మద్యపానం
  • మందులు ( బెంజోడయాజేపిన్స్, కార్టికో స్టెరాయిడ్స్ , బార్బిత్యూరేట్స్ )
  • Vagus, Phrenic అనే నరాలకు ఏవైనా ఇబ్బంది
  • ఈ నారల్లలో కనితులు ట్యూమర్స్ ఉన్నవారిలో
  • థైరాయిడ్ గాయిటర్
  • మెదడులో ఇబ్బంది ( ఏంసేపలైటిస్, మెనీన్జైటిస్)

ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏం చేయాలి ?

  • ఒకటి నుండి రెండు టీ స్పూన్స్ చక్కెర తీసుకోవడం వలన ఎక్కిళ్ళు ఆగిపోతూ ఉంటాయి. చక్కెర తీసుకోవడం వల్ల గొంతులో కొద్దిపాటి ఇరిటేషన్ వచ్చి డయాఫ్రమ్ అనే కండరం రిలాక్స్ అవుతుంది దీనివల్ల వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
  • చక్కర లేనట్లయితే ఒకటి నుండి రెండు టీ స్పూన్ తేనె తీసుకోవాలి.
  • కొద్దిగా నిమ్మకాయ తినడం వలన కూడా ఎక్కిళ్ళు ఆగిపోతాయి. నిమ్మకాయలు లో ఆసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . అందువలన నిమ్మకాయ తీసుకున్నప్పుడు ఈసోఫాగాస్ డిస్ట్రబ్ అయి వేగస్ నరం అనేది స్టిములేట్ అయ్యి వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
  • చల్లటి నీళ్లు తాగడం
  • మూడు నుంచి ఐదు సెకండ్లు శ్వాస ఆపుకోవడం వల్ల కూడా ఎక్కిళ్లు అవిపోతాయి .శ్వాస బిగబెట్టుకోవడం వల్ల కార్బన్డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి వీటివలన డయాఫ్రం రిలాక్స్ అయ్యి ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
  • పేపర్ బ్యాగులో శ్వాస వదిలేయడం
  • ఎవరికైతే ఎక్కిళ్ళు చాలా సమయం వరకు ఉంటాయో అలాంటివారు కండరాలను రిలాక్స్ చేసే మెడిసిన్ “Baclofen” తీసుకోవడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

ఎక్కిళ్ళు అనేవి చాలా తీవ్రంగా ఉండి , ఇబ్బంది ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది.

ఎక్కిళ్ళు

మరింత సమాచారానికి క్రింద వీడియో చూడండి :

ఎక్కిళ్ళు వెంటనే ఆగి పోవాలంటే ఏం చేయాలి ?

Leave a Comment