* ఎండోస్కోపీని EGD ( ఈసోఫాజియో గ్యాస్ట్రో డియోడినో స్కోపి) అని కూడా పిలుస్తూ ఉంటారు.
* ఈ ఎండోస్కోపీ ఆహార నాలము , జీర్ణకోసవ్యవస్థ పై భాగాలు అంటే నోరు, అన్నవాహిక ( Esophagus ), కడుపు( Stomach), ఆంత్రా మూలము (Duodenum) చిన్న పేగు యొక్క మొదటి భాగం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎండోస్కోపీ డాక్టర్స్ సూచిస్తారు.
ఎండోస్కోపీ ఎవరిలో చేస్తారు :
- తీవ్రమైన కడుపునొప్పి
- కడుపులో అల్సర్
- పేగు క్యాన్సర్
- ఇరిటేబుల్ బోవేల్ సిండ్రోమ్
- వాంతులు ( వాంతులు లో రక్తం రావడం)
- విరోచనాలు
- అమాంతం బరువు తగ్గడం
- రక్తహీనత
- కాలేయం, పిత్తాశయం ఇబ్బంది ఉన్నవారు
- ఏవైనా ఫారెన్ బాడీ అంటే నాణెం కడుపులో,గొంతులో ఇరుక్కున్నప్పుడు ,ఇవి తీయడానికి కూడా ఎండోస్కోపీ ఉపయోగిస్తారు.
ఎండోస్కోపి చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- ఎండోస్కోపీ చేసే ఆరు నుంచి 8 గంటల ముందు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.
- ఎండోస్కోపీ చేసే రెండు గంటల ముందు నుంచి నీళ్లు కూడా తాగకూడదు.
- షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె సంబంధిత ఇబ్బంది, ఎలర్జీ ఉన్నవారు, రక్తం పల్చగా అయ్యే మెడిసిన్ ఉపయోగించేవారు, ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఈ ఎండోస్కోపీ చేయించుకోవాలి.
ఎండోస్కోపీ ఎలా చేస్తారు ?
- ఎండోస్కోపీ “ఎండోస్కోప్” అనే పరికరం ఉపయోగించి చేస్తారు.
- ఎండోస్కోప్ అనేది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది.ఈ ట్యూబ్ కి ఒక కెమెరా అతికించి ఉంటుంది. ఈ కెమెరా అనేది కంప్యూటర్ కి కనెక్ట్ అవుతుంది. ఈ కెమెరా ద్వారా లోపల ఉన్న భాగాలు డాక్టర్స్ చూడగలుగుతారు.
- ఎండోస్కోపీ చేసే ముందు నోటిలో లోకల్ అనస్థషియా స్ప్రే చేస్తారు. ఇలా అనస్థీషియా మత్తు స్ప్రే చేయడం వల్ల లోపల అంటతా మొద్దు బారుతుంది, ఈ ఎండోస్కోప్ పెట్టినప్పుడు ఎటువంటి నొప్పి అనేది తెలియదు.
- అలాగే పంటిని కాపాడడానికి మౌత్ గాడ్ పెడుతుంటారు. మరికొందరికి నోటిలో అనస్థీషియా స్ప్రే కాకుండా ఐ.వి సేడేషన్ చేస్తూ ఉంటారు .
- ఈ అనస్థీషియా స్ప్రే చేసిన తర్వాత నోటి నుంచి ఎండోస్కోప్ లోపలికి పంపుతారు.
- ఈ ఎండోస్కోప్ ఆహారనాలము లేదా జీర్ణ వ్యవస్థ భాగాలు అయినా నోరు, గొంతు, అన్నవాహిక కడుపు అలాగే ఆంత్రనాలము ఎలా ఉన్నాయి వీటిలో ఏవైనా అల్సర్స్ లేదా ఏవైనా పాలిప్స్ లేదా వీటిలో ఇంకా ఏమైనా ఇబ్బంది ఉందా అని చూస్తారు.
- ఎండోస్కోపీ చేయడానికి సుమారు 20 నుంచి 30 నిమిషాలు వరకు సమయం అవ్వచ్చు.
ఎండోస్కోపీ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
ఎండోస్కోపీ చేసిన తర్వాత అరగంట వరకు నీళ్లు తాగకూడదు అలాగే ఒక గంట వరకు ఆహారం తీసుకోకూడదు.
ఎండోస్కోపీ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు వస్తాయి :
ఎండోస్కోపీ వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కొందరికి కడుపులో గ్యాస్, తేన్పులు, గొంతు నొప్పి ఇలాంటివి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది.
ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది :
ఎండోస్కోపీ చేయించుకోవడానికి సుమారు 1500 నుంచి 2000 రూపాయలు వరకు ఖర్చవుతుంది.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :