మనం నడిచినప్పుడు పాదాల పైన ఎక్కువగా ఒత్తిడి అనేది పడుతుంది. ఈ ఒత్తిడి వలన కొంతమందికి పాదాల అడుగున చర్మం దెబ్బతినడం, పొరలుగా రావడం, చిన్న చిన్న కాయలుగా ఏర్పడుతుంది. వీటిని మనం ఆనెలు ఫుట్ కాన్ అంటాము.
ఆనెలు రావడానికి కారణాలు :
- గట్టిగా ఉండే చెప్పులు ధరించి ఎక్కువగా దూరం నడిచే వారికి
- చెప్పులు లేకుండా ఎక్కువ దూరం నడిచేవారు
- చెప్పులు బిగుతుగా ఉన్న, హై హీల్స్ చెప్పులు వేసుకునే వారిలో పాదాల చర్మంపై అధిక రాపిడి ఏర్పడి ఆనెలు వస్తాయి.
ఆనేల సమస్య సాధారణ వ్యక్తులతో పోల్చితే బరువు ఎక్కువగా ఉన్నవారిలో, మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
ఈ ఆనెలు ఉన్నవారు నడిచిన, నిలబడిన తీవ్రమైన నొప్పి ఉంటుంది.
ఆనెలు ఎక్కువగా అరికాలు , మడమ భాగంలో, వేళ్ళ మధ్యలో ఎక్కువగా వస్తాయి.
ఆనెలు యొక్క చికిత్స విధానం :
- ఆనేలు ఉన్నవారు గోరువెచ్చని నీటిలో 20 నిమిషాల పాటు పాదాలు వుంచి , ఆ తర్వాత పాదాలను రుద్దాలి , తర్వాత డ్రై చేసి వ్యాసలిన్ లేదా పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు రెండుసార్లు రెండు వారాల వరకు చేయాలి.
- ఆనేలు ఉన్నవారికి వైద్యులు కాన్ క్యాప్స్ ఉపయోగించమని సూచిస్తారు. ఒక కాన్ కాప్స్ ( Leeford Corn caps , Medigrip Corn caps , Dr.Foot corn caps ) రెండు రోజులు ఉపయోగించాలి . ఇలా రెండు వారాల వరకు కార్న్ కాప్స్ పెట్టుకోవాలి.
- సాలి సైలిక్ యాసిడ్ ( Salactin L ; Salex L lotion ) ఉపయోగించాలి.
- యూరియా ఉన్న మాశ్చరైజర్స్ ( Dr Foot 40%Urea Gel , Aqurea 40% Urea gel ) ప్రతిరోజు రెండుసార్లు ఉపయోగించాలి ఇలా మూడు నుంచి నాలుగు వారాల వరకు ఉపయోగించాలి.
- ఆనేలు చాలా తీవ్రంగా ఉన్నట్లయితే సాలిసిలిక్ యాసిడ్ అలాగే యూరియా ఉన్న మెడిసిన్ (Salicure ) అనేది ఉపయోగించాలి.
- ఈ పద్ధతులు పాటించిన కూడా ఆనెలు తగ్గనట్లయితే డర్మటాలజిస్ట్ లేదా జనరల్ సర్జన్ వంటి వైద్యులను సంప్రదించాలి. ఆనెలు తీవ్రంగా ఉన్నట్లయితే సర్జరీ ద్వారా తొలగించవలసి వస్తుంది.
ఆనెలు ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- సౌకర్యంగా, లూస్ గా ఉన్న చెప్పులు ధరించాలి.
- గట్టిగా, బిగుతుగా ఉన్న బూట్లు , చెప్పులు ధరించకూడదు.
- చెప్పులు లేకుండా ఎక్కువ దూరం నడవకూడదు.
- హై హీల్స్, ఎత్తు చెప్పులు వేయకూడదు
- చెమటలు పట్టకుండా గాలి వచ్చే బూట్లు ధరించాలి.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :