అల్ల నేరేడు పండు ఉపయోగాలు

అల్లనేరేడు పండుని ఇంగ్లీషులో బ్లాక్ ఫ్లం లేదా జామున్ అంటారు.

వీటిని “ఫ్రూట్ ఆఫ్ గాడ్స్” అని కూడా అంటారు. ఇది చూడడానికి డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది . వేసవి కాలంలో అధికంగా ఈ పండు లభిస్తుంది.

అల్లనేరేడు పండులో చాలా పోషక విలువలు ఉంటాయి .యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ ఫోరస్, క్యాల్షియం,  ఫైబర్ , ఫోలిక్ యాసిడ్, ఫ్యాట్ ,ప్రోటీన్స్, సోడియం,  కరోటిన్ ఈ విధంగా చాలా  పోషక విలువలు ఉంటాయి.

అల్లనేరేడి పండు ఆరోగ్య ప్రయోజనాలు :

  • వీటిలో విటమిన్ సి, ఐరన్ ,అధికంగా ఉండడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ని పెంచడానికి చాలా సహాయపడుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా అల్లనేరేడు పండు చాలా సహాయపడుతుంది.
  • చర్మం కాంతివంతంగా ఉండడానికి అలాగే పింపుల్స్ తగ్గించడానికి కూడా ఇవి చాలా సహాయపడతాయి.
  • వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా అల్లా నేరేడు పండు తీసుకోవచ్చు.
  • యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి అల్లనేరేడు పండు సహాయపడుతుంది.
  • అల్లనేరేడు పండులో పీచు ఎక్కువగా ఉండటం క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల బరువు, తగ్గవాలనుకుంటే ఈ పండు చాలా సహాయపడుతుంది.
  • అలాగే మలబద్ధకాన్ని తగ్గించడానికి, ఆజీర్తిని తగ్గించడానికి అల్లనేరేడు పండు ఉపయోగపడుతుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచడానికి , కంటి ఆరోగ్యానికి, జుట్టు దృఢత్వానికి ,అలాగే క్యాన్సర్ రాకుండా నివారించడానికి అల్లనేరేడు పండు చాలా ఉపయోగపడుతుంది

అల్లనేరేడు పండు ఎన్ని తినాలి అలాగే ఏ సమయంలో తీసుకోవాలి :

అల్లనేరేడు పండు సుమారు 100 గ్రాముల వరకి ప్రతిరోజు తీసుకోవచ్చు.

జ్యూస్ తీసుకునేవారు 3 నుంచి 4 టీ స్పూన్స్ అల్లనేరేడు పండు జ్యూస్ తీసుకోవచ్చు.

అల్లా నేరేడు  పండు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు కానీ పడిగడుపున మాత్రం  తీసుకోకూడదు. తినకముందు ఈ పండ్లు తినడం వలన అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

అల్లనేరేడు పండు దుష్ప్రభావాలు :

అల్లనేరేడు పండు అధికంగా తినడం వలన కడుపులో అసిడిటీ గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి :

Leave a Comment