Albendazole Tablets- అల్బెండజోల్ ( నులి పురుగులు తగ్గించే టాబ్లెట్) ఉపయోగాలు, దుష్ప్రభావాలు.

Albendazole tablet

అల్బెండజోల్ అనేది ఒక ఆంటీ పారసైటిక్ మెడిసిన్. శరీరంలో ఉన్న నులి పురుగులు, బద్దే పురుగు, కొంకే పురుగు లు తగ్గించే టాబ్లెట్ .

Parasites

ఈ అల్బెండజోల్ మార్కెట్ లో ” Zentel 400 ” ; “Ben dex 400” అనే పేరు తో మందుల దుకాణం లో ఉంటుంది .

Zentel 400

ఈ అల్బెండజోల్ టాబ్లెట్స్ అలాగే సిరుప్స్ రూపంలో ఉంటుంది.

అల్బెండజోల్ పిల్లలకు వచ్చే వార్మ్ ఇన్ఫెక్షన్ తగించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

వార్మ్ ఇన్ఫెక్షన్(నులి పురుగులు ఇన్ఫెక్షన్) రావడానికి కారణాలు :

  1. మట్టిలో లేదా గడ్డి లో చెప్పులు లేకుండా నడవడం వలన ఈ నులి పురుగులు శరీరంలొ కి వచ్చే అవకాశం ఉంటుంది
  2. పిల్లలు మట్టిలో ఆడుకునప్పుడు నులి పురుగులు మట్టి నుంచి పిల్లల గోర్లు లోకి వెళ్ళి అక్కడనుంచి శరీరం లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది.
  3. నులి పురుగులు ఎక్కువగా చెరువులు, నీళ్ల ట్యాంక్ లో ఉంటుంది. కలుషితమైన నీరు త్రాగడం లేదా కలుషితమైన నీళ్ళల్లో ఈత కొట్టడం వలన కూడా ఈ వార్మ్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
  4. ఉడకని మాంస హారం , సరిగా శుభ్రం చేయని కూరగాయలు నుంచి కూడా నులి పురుగులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
worms

వార్మ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు :

  1. మల ద్వారం దగ్గర తీవ్రమైన దురద ఉండడం..ఎక్కువగా రాత్రికి పడుకునే సమయంలో ఉంటుంది
  2. తిన్న తరువాత కడుపులో నొప్పి ఉండదు
  3. బరువు తగ్గడం
  4. ఎత్తు పెరగక పోవడం
  5. రక్త హీనత
  6. ఆకలి ఉండక పోవడం
  7. అజీర్తి లాంటి లక్షణాలు కనిపిస్తాయి
నులి పురుగులు

అల్బెండజోల్ ఎంత మోతాదులో తీసుకోవాలి ?

* 2 సంవత్సారాలు కన్నా తక్కువ ఉన్న వారు – 200 mg టాబ్లెట్ తీసుకోవాలి.

* 2 – 14 సంవత్సారాలు ఉన్నవారు 400 మి ఉన్న 1 టాబ్లెట్ తీసుకోవాలి.

ఈ టాబ్లెట్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ , తిన్న తరువాత రాత్రి పడుకునే సమయంలో తీసుకోవాలి. 3 రోజులూ ఈ అల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలి.

కొందరు వైద్యులు పిల్లలకు ప్రతి 6 నెలలకు ఈ అల్బెండజోల్ టాబ్లెట్ తీసుకొమ్మని సూచిస్తారు .

ఈ అల్బెండజోల్ టాబ్లెట్ తీసుకున్నాక గ్రేప్స్ అలానే గ్రేప్ జ్యూస్ తీసుకోకూడదు.

అల్బెండజోల్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • గాబరవడం
  • వాంతులు
  • కడుపు నొప్పి
  • తల నొప్పి

అల్బెండజోల్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు ?

  • అలర్జీ
  • ప్రెగ్నెన్సీ
  • పాలు ఇచ్చే తల్లులు
  • లివర్ సమస్య
  • బోన్ మ్యారో సమస్య ( ఆప్లాస్టిక్ అనేమియా ) సమస్య ఉన్నవారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
Albendazole ( Zentel Tablets )

Leave a Comment