అల్ట్రా సౌండ్ స్కాన్ ఎలా చేస్తారు ; చేయించుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు !!!

అల్ట్రా సౌండ్ స్కాన్

అల్ట్రా సౌండ్ స్కాన్ ను అల్ట్రా సోనాగ్రఫీ లేదా యూ.ఎస్. జి అని కూడా అంటారు.

అల్ట్రా సౌండ్ స్కాన్ ఒక నాన్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా ధ్వని వాయువులు ఉపయోగించి శరీరంలొ ఉన్న అవయవాల యొక్క స్థితిని తెలుసుకోవచ్చు.

అల్ట్రా సౌండ్ స్కాన్ రకాలు :

అల్ట్రా సౌండ్ స్కాన్ చాలా రకాలుగా ఉంటుంది.

USG Abdomen :

కాలేయం, పిత్తాశయం ,క్లోమ గ్రంథి ,కడుపు, మూత్ర పిండాలు, ప్లీహము తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది.

USG Pelvis :

ఆడవారు అలాగే మగవారి యొక్క పునర ఉత్త్పత్తి అవయవాలు , మూత్రాశయం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది.

USG Thyroid :

థైరాయిడ్ గ్రంథి నుంచి తెలుసుకోవడానికి ఇది ఉపయోగ పడుతుంది.

అల్ట్రా సౌండ్ స్కాన్ ( USG Abdomen ) ఎవరు చేయించుకోవాలి :

  • గర్భవతులు
  • కడుపు నొప్పి
  • అప్పెండీసైటిస్
  • కడుపు లో కణుతులు
  • కిడ్నీ లో రాళ్లు
  • పిత్తాశయం లో రాళ్ళు
  • మూత్రాశయం లో రాళ్లు
  • కాలేయ సంబంధిత ఇబ్బంది
  • క్లోమ గ్రంథి వాపు ఉన్నవారు ఈ USG ABDOMEN అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకోవాలి.

అల్ట్రా సౌండ్ స్కాన్ USG Pelvis ఎవరు చేయించు కోవాలి :

  • నెలసరి సమస్య
  • PCOD ( అండాశయం లో నీటి బుడగలు )
  • ఎండో మెట్రియుం ఇబ్బంది ఉన్నవారు ఈ USG Pelvis అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకోవాలి.

అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు :

అల్ట్రా సౌండ్ స్కాన్ USG Abdomen కి చేయించేవారు 6 నుంచి 8 గంటలు ఏమి తినకూడదు.

అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకునే సమయంలో మూత్రాశయం నిండుగా ఉండాలి ( కనీసం 4-6 గ్లాసుల నీళ్ళు త్రాగాలి)

అల్ట్రా సౌండ్ స్కాన్ USG Pelvis చేయించుకునే వారికి ఫాస్తింగ్ అవసరం ఉండదు. అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించే సమయంలో మూత్రాశయం నిండుగా ఉంటే చాలు.

అల్ట్రా సౌండ్ స్కాన్ ఎలా చేస్తారు ?

  • అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకోవడం చాలా సులభం.ఈ అల్ట్రా సౌండ్ స్కాన్ చేసే సమయంలో ఆ వ్యక్తిని ఒక టేబుల్ పైన పడుకో పెడతారు.
  • ఆ తర్వాత ఎక్కడైతే స్కాన్ చేస్తున్నారో ఆ ప్రదేశంలో అల్ట్రా సౌండ్ జెల్ పెడతారు.ఈ జెల్ పెట్టడం వలన స్పష్టమైన ఇమేజ్ వస్తుంది.
  • ఈ జెల్ పెట్టిన తర్వాత ట్రాన్స్ ద్యోసర్ ప్రోబ్ అనేది కడుపు పైన తిప్పుతారు.
  • ఈ ట్రాన్స్ ద్యూసర్ ప్రోబ్ నుంచి ధ్వన వాయువులు వస్తాయి. ఈ ధ్వని వాయువులు శరీరంలో కి వెళ్లి ఆ తర్వత బౌన్స్ అవుతాయి. అక్కడ నుంచి కంప్యూటర్ లోకి వెళ్లి ఒక ఇమేజ్ వస్తుంది.

అల్ట్రా సౌండ్ స్కాన్ చేయడానికి ఎంత సమయం అలాగే ఎంత ఖర్చు అవుతుంది :

అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకోవడానికి సుమారు 15 – 30 నిమిషాలు సమయం పడుతుంది అలాగే 800 – 1500 రూపాయాలు ఖర్చు అవుతుంది.

మరింత సమాచారానికి ఈ క్రింది విడియో చూడండి.

Leave a Comment