అల్ట్రాసెట్ టాబ్లెట్ లో ట్రామాడాల్ (Tramadol ) 37.5 మి.గ్రా ఉంటుంది అలాగే అసితోమినాఫెన్ (Acetominaphen )325 మి.గ్రా. ఉంటుంది
ట్రామాడాల్ అనేది ఒక ఓపియాడ్ అనాల్జేసిక్ . ఈ ట్రామాడాల్ మెదడు లో పని చేసి నొప్పిని తగ్గిస్తుంది.
అసితోమినాఫెన్ నొప్పిని ,జ్వరం ను తగ్గిస్తుంది ,అలాగే ట్రామాడాల్ యొక్క పని తీరును మెరుగు పర్చుతుంది.
అల్ట్రాసెట్ టాబ్లెట్ ఉపయోగాలు :
- తీవ్రమైన నొప్పి తగ్గిస్తుంది
- ఒళ్ళు నొప్పులు
- నడుము నొప్పి
- తల నొప్పి
- ఆర్థరైటిస్
- నరాల నొప్పి
- ఎముకలు ఫ్రాక్చర్ నొప్పి
- పంటి నొప్పి
- వెన్ను ముక్క నొప్పి
- సయాటిక్ నొప్పి ఇలా ఎటువంటి తీవ్ర నొప్పి అయిన తగ్గించడానికి అల్ట్రాసెట్ టాబ్లెట్ తీసుకోవాలి.
అల్ట్రాసెట్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి :
అల్ట్రాసెట్ టాబ్లెట్ ప్రతి రోజు తిన్న తర్వాత రెండు లేదా మూడు పూటలు తీసుకోవాలి.
సాధారణంగా నొప్పి ఉన్నప్పుడు తీసుకోవాలి , సుమారు ఐదు రోజులు ఉపయోగించాలి.
అల్ట్రాసెట్ టాబ్లెట్ 12 ఏళ్ల లోపు పిల్లలు తీసుకోకూడదు.
అల్ట్రాసెట్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- గాబారవడం
- కళ్ళు తిరగడం
- వాంతులు
- మలబద్దకం
- మూత్రం పసుపు పచ్చగా రావడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి.
అల్ట్రాసెట్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :
- త్రామాడాల్ , ప్యారాసేటామాల్ అలర్జీ
- శ్వాస కోశ ఇబ్బంది ( ఆస్త్మా, copd )
- కిడ్నీ,కాలేయ సంబంధిత ఇబ్బంది
- డయాబెటిస్
- కడుపు నొప్పి
- గర్భవతులు , పాలు ఇచ్చే తల్లులు ఈ అల్ట్రాసెట్ టాబ్లెట్ తీసుకోకూడదు. గర్భవతులు అల్ట్రాసెట్ టాబ్లెట్ తీసుకోవడం వలన పుట్ట బోయే బిడ్డకు చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది.