అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు|Benefits of eating banana in Telugu .

Banana (అరటి పండు ఆరోగ్య ప్రయోజనాలు)

అరటిపండు చాలా తక్కువ ఖర్చుతో, ఎక్కువగా పోషక విలువలు అందుబాటులో ఉన్న పండు.

  • అరటి పండులో పీచు ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆజీర్తి సమస్యను తగ్గించడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి ఇవి చాలా సహాయపడుతుంది.
  • బరువు తగ్గాలనుకునే వారు కూడా అరటిపండు తీసుకోవచ్చు.
  • అరటి పండులో “పొటాషియం” ఎక్కువగా ఉంటుంది అందువల్ల గుండె ఆరోగ్యానికి, తిమ్మిర్లు రాకుండా నివారించడానికి, కిడ్నీ ఆరోగ్యానికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటుంది.
  • కడుపులో గ్యాస్ తగ్గించడానికి అరటిపండు తినవచ్చు.
  • విటమిన్ “ఏ” , విటమిన్ “ఈ” ల్యూటిన్, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపరచడానికి అరటిపండు ఉపయోగపడుతుంది.
  • శరీరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి అరటిపండు సహాయపడుతుంది.

అరటిపండు షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవచ్చా ?

ఆకుపచ్చగా ఉన్న అరటికాయలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. బాగా పండిన పసుపచ్చగా ఉన్న అరటి పండులో మాత్రం షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన షుగర్ ఉన్నవారు అరటికాయ లేదా కొద్దిగా పండిన అరటిపండు తీసుకోవచ్చు . ఎక్కువగా పండిన అరటి పండు మాత్రం తీసుకోకూడదు.

అరటిపండు ఏ సమయంలో తినాలి :

అరటిపండు ఎప్పుడైనా పొద్దున లేదా సాయంత్రం తిన్న తర్వాత తీసుకోవాలి.

అరటిపండు రాత్రిపూట తినకూడదు. రాత్రిపూట తినడం వల్ల గొంతులో మ్యూకస్ అనేది ఏర్పడుతుంది.

అరటిపండు దుష్ప్రభావాలు :

అరటిపండు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం లాంటి దుష్ప్రభావం చూస్తాము.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Benefits of Eating Banana|అరటి పండు ఆరోగ్య ప్రయోజనాలు

Leave a Comment