అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించే టాబ్లెట్. అమోక్స్సలిన్ అనేది పెన్సిలిన్ యాంటీబయోటిక్. క్లావ్లోనిక్ ఆసిడ్ అమోక్ససిలిన్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ టాబ్లెట్స్ సిరప్ ఇంజక్షన్స్ సాటిస్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ 375 మిల్లీగ్రామ్స్ 625 మిల్లి గ్రామ్స్ ,1000 మిల్లీగ్రామ్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిలో క్లావ్లోనిక్ ఆసిడ్ 125 మిలిగ్రామ్స్ ఉంటుంది.
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ అనేది Augmentin, MoxikindCV, Clavam 625, Omniclav అనే పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ టాబ్లెట్ ఉపయోగాలు :
- బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి
- చెవి నొప్పి
- ముక్కునొప్పి
- గొంతు నొప్పి
- కంటి ఇన్ఫెక్షన్
- పంటి నొప్పి
- శ్వాస కోస వ్యవస్థ ఇబ్బంది
- మూత్ర నాళ ఇన్ఫెక్షన్
- కిడ్నీ ఇన్ఫెక్షన్
- మోకాలు నొప్పులు
- సర్జరీ తర్వాత ఈ టాబ్లెట్ ఉపయోగించమని వైద్యులు సూచిస్తారు.
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ టాబ్లెట్ఎలా ఉపయోగించాలి :
* అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ చిన్నపిల్లల్లో అయితే వారి బరువు ప్రకారం డోసేజ్ ఉంటుంది. సాధారణంగా 40 కేజీల కన్నా తక్కువగా బరువున్న వారిలో 375 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ ప్రతిరోజు మూడు పూటలు తీసుకోమని వైద్యులు సూచిస్తారు.
* పెద్దవారిలో అయితే వారికి ఉన్న తీవ్రత ప్రకారం డోసేజ్ అనేది ఉంటుంది. ఈ టాబ్లెట్ ప్రతిరోజు మూడు పూటలు తిన్న తర్వాత వేసుకోవాలి. అలాగే ఐదు రోజులు కచ్చితంగా ఈ టాబ్లెట్ అనేది తీసుకోవాలి.
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ దుష్ప్రభావాలు :
- కడుపునొప్పి
- వాంతులు
- విరోచనాలు
- తలనొప్పి
- కళ్ళు తిరగడం
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ ఎవరు ఉపయోగించకూడదు :
- పెన్సిలిన్ అలర్జీ ఉన్నవారు
- గర్భవతులు పాలు ఇచ్చే తల్లులు
- జాండీస్
- లివర్ సమస్య ఉన్నవారు ఈ టాబ్లెట్ ఉపయోగించకూడదు.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి: