అజిత్రోమైసిన్ యొక్క ఉపయోగాలు అలాగే దుష్ప్రభావాలు|Azithromycin Tablets Uses in Telugu

అజిత్రోమైసిన్ అనేది ఒక మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్ . అజిత్రోమైసిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా సహాయపడుతుంది.

అజిత్రోమైసిన్ ఉపయోగాలు:

  • శ్వాసకోశ వ్యవస్థ ఇబ్బంది
  • బ్రాంకైటిస్
  • న్యుమోనియా
  • ఊపిరితిత్తుల సమస్య
  • సైనసైటిస్
  • గొంతు నొప్పి
  • యురెత్రా ఇన్ఫెక్షన్
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
  • చర్మ సమస్యలు తగ్గించడానికి ఈ అజిత్రోమైసిన్ ఉపయోగపడుతుంది.

అజిత్రోమైసిన్ ఎన్ని రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది :

అజిత్రోమైసిన్ సిరప్ రూపంలో ,టాబ్లెట్స్ రూపంలో ఆలాగే ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ రూపంలో అజిత్రోమైసిన్ షాపులో అందుబాటులో ఉంటుంది.

అజిత్రోమైసిన్ ఎన్ని మిల్లీగ్రామ్ అలాగే ఎప్పుడు ఎలా తీసుకోవాలి :

అజిత్రోమైసిన్ 250 మిల్లీ గ్రామ్స్, 500 మిల్లీగ్రామ్, 600 మిల్లిగ్రామ్స్ మోతాదులో ఉంటుంది.

అజిత్రోమైసిన్ టాబ్లెట్ డోసేజ్ ఆ వ్యక్తి యొక్క ఇన్స్పెక్షన్ ప్రకారం ఉంటుంది. గొంతు నొప్పితో బాధపడేవారికి సాధారణంగా 500 మిల్లీ గ్రామ్స్, ప్రతిరోజు ఒకటి తీసుకోమని వైద్యులు సూచిస్తారు .

అజిత్రోమైసిన్ సుమారు 3 నుంచి ఐదు రోజులు ఉపయోగించాలి.

అజిత్రోమైసిన్ టాబ్లెట్ తిన్న తర్వాత లేదా తినక ముందు కూడా తీసుకోవచ్చు కానీ ఎవరైతే azithromycin ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ ఉపయోగిస్తున్నారో వారు మాత్రం తినక ముందు ఈ టాబ్లెట్ తీసుకోవాలి.

అజిత్రోమైసిన్ ఎవరు తీసుకోకూడదు:

  1. కాలేయ సంబంధిత వ్యాధి
  2. జాండిస్
  3. ప్రెగ్నెన్సీ
  4. పాలు ఇచ్చే తల్లులు
  5. రక్తం పలుచగా అవ్వడానికి ఉపయోగపడే మందులు తీసుకునే వారు అజిత్రోమైసిన్ తీసుకోకూడదు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ టాబ్లెట్ తీసుకోవాలి

అజిత్రోమైసిన్ దుష్ప్రభావాలు :

ఈ అజిత్రోమైసిన్ తీసుకోవడం వలన కొందరికి వాంతులు రావడం ,గాబరవడం ,విరోచనాలు రావడం లాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది . ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ ని ఉపయోగించకూడదు.

మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి :

Azithromycin Tablets uses and side effects in Telugu

Leave a Comment